Telugu Gateway
Cinema

సంక్రాంతి బ‌రిలో'బంగార్రాజు'

సంక్రాంతి బ‌రిలోబంగార్రాజు
X

సంక్రాంతి బ‌రిలో నిల‌వాల్సిన కీల‌క సినిమాలు వాయిదా ప‌డ్డాయి. అయినా స‌రే నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌లు న‌టించిన 'బంగార్రాజు' మాత్రం త‌గ్గేదేలే అంటోంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. మీ సంక్రాంతి సంబ‌రాల‌ను మ‌రింత ఆనందింప‌చేయ‌టానికి మా సోగ్గాళ్లు వ‌చ్చేస్తున్నారు అంటూ అన్న‌పూర్ణ స్టూడియోస్ త‌న ఇన్ స్టా పేజీలో వెల్ల‌డించింది. పండ‌గ‌లాంటి సినిమా అని పేర్కొంది. ఈ సినిమాలో నాగార్జున‌కు జోడీగా ర‌మ్య‌క్రిష్ణ‌, అక్కినేని నాగ‌చైత‌న్య‌కు జోడీగా కృతిశెట్టి సంద‌డి చేయ‌నున్నారు. కుర‌సాల క‌ళ్యాణ్ క్రిష్ణ దర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా తీసుకొస్తున్నారు.

Next Story
Share it