ఆర్ఆర్ఆర్ ఎలా విడుదల చేస్తారో చూస్తాం
BY Admin31 Oct 2020 4:58 PM GMT

X
Admin31 Oct 2020 4:58 PM GMT
దర్శకుడు రాజమౌళిపై బిజెపి నేతలు మండిపడుతున్నారు. ఇటీవలే ఆ పార్టీ ఎంపీ సోయం బాబూరావు కొమరం భీమ్ పరిచయ వీడియోలో హీరో ఎన్టీఆర్ కు టోపీ పెట్టడంపై మండిపడ్డారు. ఈ సీన్ తీసేయకపోతే థియేటర్లను తగలబెడతామని హెచ్చరించారు. రాజమౌళితో మాట్లాడేందుకు ప్రయత్నించగా..ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపారు.
ఇప్పుడు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కూడా రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. థియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఎలా నడిపిస్తారో చూస్తామని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని బండి వార్నింగ్ ఇచ్చారు.
Next Story