Telugu Gateway
Cinema

అమరావతిలో పూజా కార్యక్రమం

అమరావతిలో పూజా కార్యక్రమం
X

నందమూరి బాలకృష్ణ దూకుడు మీద ఉన్నారు. టాలీవుడ్ లో యువ హీరో లు రెండు...మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే బాలకృష్ణ మాత్రం వరసపెట్టి సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఇప్పటికే ఆయన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్ బికె 111 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. వాస్తవానికి ముందు ఈ సినిమాలోకి నయనతారను అనుకున్నారు. ఆ తర్వాత బడ్జెట్ పరిమితులతో మార్పులు చేశారు. ఒక వైపు ఎన్ బికె 111 అలా సాగుతుండగానే ఇప్పుడు మరో సినిమా అంటే ఎన్ బికె 112 సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సినిమాను సంచలన దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే కొరటాల శివ సినిమా విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత చెరుకూరి సుధాకర్ కు చెందిన ఎస్ ఎల్ వి సినిమాస్, మిక్కలినేని సుధాకర్ కు చెందిన యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 25వ తేదీన అమరావతిలోని వెంకటపాలెం టీటీడీ కి చెందిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా స్టార్ట్ కానుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ లు హాజరు అవుతున్నారు. కొరటాల శివ, బాలకృష్ణ ల పవర్ ఫుల్ కాంబినేషన్ సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో దేవర 2 ఉంటుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు బాలకృష్ణ, కొరటాల శివ సినిమా స్టార్ట్ కానుంది.

Next Story
Share it