Telugu Gateway
Cinema

బాలయ్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్!

బాలయ్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్!
X

నందమూరి బాలకృష్ణ స్టైలిష్ లుక్...స్టైలిష్ యాక్షన్...థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఎన్ బికె 111 గ్లింప్స్ అదిరిపోయింది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎలాంటి హంగామా కోరుకుంటారో వాటితోనే ఇది మొత్తం సాగింది. ఈ సినిమా బాంబే బ్యాక్ డ్రాప్ స్టోరీ తో తెరకెక్కుతున్న సంకేతాలు ఇచ్చారు ఇందులో. చిత్ర యూనిట్ మొదటి నుంచి చెప్పినట్లే వింటేజ్ బాలకృష్ణను కాకుండా న్యూ ఏజ్ బాలకృష్ణను చూపించారు. జూన్ 10 బాల కృష్ణ పుట్టిన రోజు కావటంతో ఆయన అభిమానుల కోసం ఈ మూవీ నుంచి బుధవారం సాయంత్రం ఈ గ్లింప్స్ విడుదల చేసింది. ఒక నిమిషం 31 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రీట్ అభిమానులను అలరించేలా ఉంది. బాలకృష్ణ స్టైలిష్ లుక్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇందులో కొత్తగా ఉంది.

దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన వీరసింహ రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించటంతో ఇప్పుడు బాలకృష్ణ 111 వ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు విడుదల అయిన గ్లింప్స్ కూడా అంచనాలను మరింత పెంచింది అనే చెప్పాలి. ఇందులో ముఖ్యంగా బాలకృష్ణ ఎంట్రీకి థమన్ అందించిన వెరైటీ స్కోర్ ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇచ్చింది అనే చెప్పొచ్చు. ఫస్ట్ ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడి గా నయనతార పేరు ప్రకటించారు. నయనతార రెమ్యూనరేషన్ ఎక్కువ కావటం..బడ్జెట్ పరిమితుల తదితర కారణాల వల్ల నయనతార ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నట్లు చెపుతున్నారు. ఈ మూవీ ని బాలకృష్ణ కు కలిసి వచ్చిన సంక్రాంతికి విడుదల చేస్తారా లేక ఇంకా ముందే ప్రేక్షకుల ముందుకు వస్తుందా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Next Story
Share it