నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 తాండవం సినిమా డిసెంబర్ 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో ఒక్క ఇండియా లోనే 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు ఉండగా...ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో 30 కోట్లు కలుపుకుని మొత్తం 150 కోట్ల గ్రాస్ సాధించినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. అఖండ కంటే ఈ అఖండ 2 సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే పెరిగిన అంచనాలను ఇది అందుకోలేకపోయింది అనే అభిప్రాయం ఎక్కువ మంది లో ఉంది.
దీనికి తోడు ఈ సినిమా విడుదల సమయంలో తలెత్తిన వివాదం కూడా ఈ మూవీ కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది అనే అభిప్రాయం ఉంది. మొత్తం మీద థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని అఖండ 2 తాండవం మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. అఖండ 2 లో బాలకృష్ణకు జోడిగా సంయుక్త మీనన్ నటించగా...అది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రాలు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. నందమూరి బాలకృష్ణ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. అయితే ఈ సినిమా ప్రధానంగా సనాతన ధర్మం, హిందూ ధర్మం ఫోకస్డ్ గా సాగినా కూడా హిందీ మార్కెట్ లో ఇది పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.



