Telugu Gateway
Cinema

వాళ్లనే స్ఫూర్తిగా తీసుకోవాలి

వాళ్లనే స్ఫూర్తిగా తీసుకోవాలి
X

నందమూరి ఫ్యాన్సీకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. బాలకృష్ణకు పలు హిట్ సినిమాలు ఇచ్చిన బోయపాటి శ్రీను, మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఉంటుంది అని కూడా ప్రచారం జరిగింది. తాజాగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడినా బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘మా అబ్బాయి మోక్షు కూడా పరిశ్రమకి రావాలి. తను కూడా విశ్వక్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటా’ అని వెల్లడించారు. బాలకృష్ణ ప్రకటనతో ఒక విషయంలో మాత్రం స్పష్టత వచ్చింది. ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ సినిమా మొదలు కానుంది అని. అందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞ కూడా అదే పనిలో ఉన్నట్లు చెపుతున్నారు. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఏ నిర్మాణ సంస్థలో ఉంటుంది...దర్శకుడు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it