బాలకృష్ణ మళ్ళీ పాడతారంట..పాట ఏదో తెలుసా?
నందమూరి బాలకృష్ణ మరోసారి పాట పాడనున్నారా?. అంటే ఔననే సమాచారం వస్తుంది. అది కూడా ఘంటశాల పాడిన శివశంకరి పాటను మరోసారి ఆలపించి విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్త సంవత్సరం అది వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. గతంలో పాడిన పాట సరిగారాలేదని..ఈ సారి ఆ లోపాలు సవరించి మరింత కొత్తగా పాటను తీసుకొచ్చే ప్రణాళికలను సిద్ధం చేశారు. తాజాగా తన స్నేహితులతో సమావేశం అయిన బాలక్రిష్ణ ఈ విషయాన్ని వారికి వివరించారు. ఎన్టీఆర్ నటించిన 'జగదేకవీరుని కథ' చిత్రంలోని 'శివశంకరీ శివానందలహరి' పాట అప్పట్లో చాలా ఫేమస్.
కానీ బాలకృష్ణ పాడిన ఈ పాటపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగింది. అసలు బాలక్రిష్ణ ఇలాంటి పాటను ఎంచుకోవటాన్ని కూడా తప్పుపట్టారు. ఇప్పుడు మరోసారి అదే పాటను ఎంచుకుని సంక్రాంతికి ఆ పాటను విడుదల చేయటానికి రెడీ కావటం అత్యంత కీలకంగా మారింది. మరి ఈ కొత్త ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే. గతంలో ఎన్టీఆర్ వీడియోతో బ్యాగ్రౌండ్ లో బాలకృష్ణ పాటను మిక్స్ చేశారు. ఈ సారి మాత్రం నేరుగా బాలక్రిష్ణ ఈ పాటను పాడబోతున్నారు.