Telugu Gateway
Cinema

'అఖండ' షెడ్యూల్ ప్యాకప్

అఖండ షెడ్యూల్ ప్యాకప్
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానే 'అఖండ'. ఇటీవలే ఈ సినిమా టైటిల్ తోపాటు టీజర్ ను విడుదల చేశారు. బాలకృష్ణ టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే అఖండ షెడ్యూల్ కు ప్యాకప్ చెప్పినట్లు ప్రగ్యా జైస్వాల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది.

తిరిగి మళ్ళీ హైదరాబాద్ లో కలుసుకుందాం అంటూ రాసుకొచ్చింది. ఇంతకు ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ సినిమా మే 28న విడుదల కావాల్సి ఉంది. అయిత కరోనా రెండవ దశ ఉధృతి కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story
Share it