Telugu Gateway
Cinema

కీర్తి సురేష్ కంట ప‌డితే మ‌టాషే!

కీర్తి సురేష్ కంట ప‌డితే మ‌టాషే!
X

కొంత మంది కొన్ని విష‌యాలను చాలా సీరియ‌స్ గా న‌మ్ముతారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇలాంటి ప‌ట్టింపులు ఎక్కువ ఉంటాయి. ఎవ‌రైనా ఎదురైతే చాలు త‌మ‌కు ఆ రోజు ఏదో ఒక న‌ష్టం జ‌రుగుతుంద‌నే అభిప్రాయం ఉంటుంది. ఇదే అంశంపై ఈ పాట తెర‌కెక్కించిన‌ట్లు క‌న్పిస్తోంది. గుడ్ ల‌క్ స‌ఖి సినిమా నుంచి సోమ‌వారం నాడు బ్యాడ్ ల‌క్ స‌ఖి పూర్తి వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఇందులో స‌ఖి పాత్ర‌లో న‌టించిన కీర్తి సురేష్ కంట ప‌డితే చాలు అంద‌రి ప‌నీ మ‌టాషే. ఫ‌న్నీగా సాగుతుంది ఈ వీడియో సాంగ్. ఈ గుడ్ ల‌క్ స‌ఖి సినిమాలో కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి న‌టించారు. ఇందులో జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌క్రిష్ణ‌లు కూడా ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా నవంబ‌ర్ 26న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

Next Story
Share it