Telugu Gateway
Cinema

బిగ్ బాస్ కెప్టెన్ అవినాష్..హోరాహోరా పోటీలో విజేత

బిగ్ బాస్ కెప్టెన్ అవినాష్..హోరాహోరా పోటీలో విజేత
X

బిగ్ బాస్ కెప్టెన్ పోటీ హోరాహోరీగా సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో రాక్షసుల పాత్రల్లో అదరగొట్టిన అవినాష్, అరియానాలు మాత్రమే కెప్టెన్ రేసులో నిలిచారు. ఈ పోటీ కూడా హోరాహోరీగా సాగింది. అవినాష్ రైల్వే స్టేషన్, అరియానా రైల్వే స్టేషన్ ల్లో ఎక్కువ మంది ప్యాసింజర్లను ట్రాలీల్లో తీసుకెళ్లి ఉంచితే వారు విజయం సాధించినట్లు లెక్క. కానీ తొలి రౌండ్ లో చెరో ఐదుగురిని మాత్రమే స్టేషన్లకు తరలించగలిగారు. కానీ బిగ్ బాస్ మరో ఆప్షన్ ఇచ్చి స్టేషన్లలో ఇప్పటికే ఉన్న వారిని కూడా ఒఫ్పించి తీసుకెళ్ళొచ్చని ప్రకటన చేశారు. దీంతో అవినాష్ మరో ప్రయత్నం చేశారు. తొలుత అరియానా స్టేషన్ కు వెళ్ళిన మోనాల్ అవినాష్ కోరిక మేరకు బండి ఎక్కి అవినాష్ స్టేషన్ కు వచ్చింది. దీంతో అవినాష్ స్టేషన్ లో ఆరుగురు, అరియానా స్టేషన్ లో నలుగురు మాత్రమే ఉండిపోయారు.

దీంతో బిగ్ బాస్ కెప్టెన్ గా అవినాష్ ను ప్రకటించారు. అయితే ఈ టాస్క్ కోసం అరియానా పడిన కష్టం మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ కూడా అరియానాను ఓదార్చారు. కెప్టెన్ గా ఎంపిక కావటంతో అవినాష్ కు వచ్చే వారం ఎలిమినేషన్ నుంచి మినహాయింపు లభించనుంది. ఈ వారంలో అవినాష్ ఎలిమినేషన్ జాబితాలో ఉన్నా...అవినాష్ ఖచ్చితంగా సేవ్ అవుతారనే అంచనాలు ఉన్నాయి. ఈ సారి ఎలిమినేషన్ ప్రధానంగా మోనాల్, దివిల మధ్యే ఉంటుందని బావిస్తున్నారు.

Next Story
Share it