అమ్మ ఫుడ్ తిన్న ఆనందంలో..!
BY Admin23 July 2021 12:37 PM IST
X
Admin23 July 2021 12:37 PM IST
హీరోయిన్లు నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉంటారు. లేదంటే ఏవో ఒక కార్యక్రమాలు ఉంటాయి. అయితే కరోనా కారణంగా చాలా మంది ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే రెండవ వేవ్ కాస్త శాంతించటంతో మళ్ళీ చాలా వరకూ షూటింగ్ ల సందడి మొదలైంది. నివేదా థామస్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా..తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగానే దగ్గరైంది.
తెలుగులో నివేదా తాజా సినిమా అంటే పవన్ కళ్యాణ్ తో కలసి చేసిన వకీల్ సాబ్ మూవీనే. ఈ భామ శుక్రవారం నాడు అమ్మ పెట్టిన ఫుడ్ తిన్నాను..ఎంతో సంతోషంగా ఉందంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమాల మద్యలో ఈ ఆనందం అంటూ రాసుకొచ్చింది.
Next Story