ఏపీలో 'భీమ్లానాయక్' పై ఆంక్షలు
టార్గెట్ పవన్ కళ్ళాణ్. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల అధికారులు థియేటర్ల యాజమానులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని చోట్ల మౌఖిక ఆదేశాలు ఉంటే..మరికొన్ని చోట్ల అధికారికంగా నోటీసులు ఇచ్చారు. ఏపీలో ఇంకా అధికారికంగా సినిమా టిక్కెట్ రేట్లు పెంచలేదు..ఐదు షోలకు అనుమతులు లేవు. సో..ఎప్పటి నుంచో అమల్లో ఉన్న నిబంధనలే ఇప్పుడు కూడా అమల్లో ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయటం..అందులో భీమ్లానాయక్ సినిమా విడుదలను ప్రస్తావించటంతో సర్కారు ఏజెండా ఏంటో స్పష్టంగా కన్పిస్తోంది.
వాస్తవానికి సీఎం జగన్ దగ్గర జరిగిన సమావేశంలో రేట్ల పెంపునకు నిర్ణయం తీసుకున్నా....పవన్ కళ్యాణ్ సినిమా కోసమే అధికారిక ఉత్తర్వులు జారీ చేయకుండా ఆపారని ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరుకు రేట్ల పెంపు ఉత్తర్వులు జారీ అవుతాయని సమాచారం. ఇదిలా ఉంటే గుడ్లవల్లేరు తహశీల్దారు రామక్రిష్ణ థియేటర్ యాజమానికి ఇచ్చిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. భీమ్లానాయక్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతిలేదని..రేట్లు పెంచటం కానీ..అదనపు షోలు వేస్తే సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.