‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పలు మార్లు మనం మూలాల గురించి మర్చిపోకూడదు అంటూ పదే పదే ప్రస్తావించారు. తాను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా...రామ్ చరణ్ హీరోగా ఉన్నా మీరు ఏది అన్నా కూడా ఆయన వల్లనే అంటూ చిరంజీవి గురించి ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు అభినందనలు అంటూ వేదికగా నుంచి మాట్లాడుతూ ఎవరైనా సరే మూలం మర్చిపోకూడదు అంటూ వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ మధ్య పెద్ద ఎత్తున వివాదం సాగుతున్న విషయం తెలిసిందే.
కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్ కు చిరంజీవి పెద్ద ఎత్తున అండదండలు అందిస్తే...ఇప్పుడు అల్లు అర్జున్ కనీసం చిరంజీవి పేరు కూడా చెప్పటం లేదు అని, అంతా తాను స్వయం కృషితో వచ్చినట్లు చెపుతున్నాడు అంటూ మండిపడ్డారు. పుష్ప 2 విడుదల సమయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో మూలాల అంశంపై స్ట్రెస్ చేసి మాట్లాడంతో ఇది గ్యారంటీగా అల్లు అర్జున్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడిందే అనే చర్చ సాగుతోంది. ఒక హీరో ని ద్వేషించే సంస్కృతి తమ ఇంట్లో లేదు. అందరూ బాగుండాలని కోరుకుంటాం అని చెపుతూ, రామ్ చరణ్ ఏడాది లో దగ్గర దగ్గర వంద రోజుల పైనే వివిధ మాలలు దరిస్తాడు అని...ఇది నెత్తికి ఏమి ఎక్కకుండా...తాను తగ్గి ఉండటం కోసమే అన్నారు.
గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వచ్చిన వాళ్ళను తాను మెగా అభిమానులు అనటం లేదు అని..ఇందులో అందరూ హీరోల అభిమానులు ఉంటారు అంటూ...ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబుల పేర్లు ప్రస్తావించారు. హీరో నాని కి తమ ఇంట్లోనే చాలా మంది అభిమానులు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని తమ కూటమి ప్రభుత్వం సినిమాల విషయంలో అందరిని ఒకేలా చూస్తుంది అని...చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమకూడదు అన్నారు. సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం హీరో లు ప్రభుత్వం వద్దకు రావాల్సిన అవసరం లేదు అని...నిర్మాతల్లో..లేక ఇతర బోడీలు వస్తే సరిపోతుంది అన్నారు. హీరోలు వచ్చిన నమస్కారాలు పెడితేనే టికెట్ రేట్లు పెంచుతాము అనేంత కింది స్థాయి వ్యక్తులం కాదు అన్నారు. టికెట్ రేట్లు పెంచటం వాళ్ళ జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అనే విషయం మర్చిపోకూడదు అన్నారు.