Telugu Gateway
Cinema

హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది

హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది
X

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు పవర్ స్టార్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదల ముహూర్తం ఖరారు అయింది. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 28 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. రిలీజ్ డేట్ తో చిత్ర యూనిట్ న్యూ లుక్ ను విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వెలువడి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సోమవారం నాడే విజయవాడలో ఏర్పాటు చేసిన భారీ సెట్ లో తొలిసారి షూటింగ్ లో పాల్గొన్నారు. అతి తక్కువ రోజుల్లోనే ఈ సినిమా పూర్తి చేసే అవకాశం ఉండంతో పవన్ కళ్యాణ్ దీనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెపుతున్నారు.

వాస్తవానికి ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. చాలా వరకు అంటే రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలిభాగం షూటింగ్ చాలా వరకు పూర్తి చేశారు. హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ లో విపరీత జాప్యం జరుగుతుండటంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకుంటే..నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఇప్పుడు ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంటే...నోరా ఫతేహి కూడా ఇందులో కనిపించబోతోంది. హరిహర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేయాల్సి ఉంటుంది.

Next Story
Share it