అనుష్క 'సూపర్' జ్ఞాపకాలు
అనుష్కశెట్టి. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది 'సూపర్' సినిమాతోనే. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, అయేషా టకియా, అనుష్కలు కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి పదహారు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా అనుష్క ఈ సినిమాకు సంబంధించిన లుక్ ను విడుదల చేసి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
తనను నమ్మి, తనకు అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్, హీరో అక్కినేని నాగార్జున, దర్శకుడు పూరి జగన్నాథ్, సోనూ, సచిన్ (మేకప్ మేన్) లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి నిత్యం తనపై ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అనుష్క అరుంథతి సినిమాతో ఓ రేంజ్ వెళ్లిపోయారు. తర్వాత ఆమె కెరీర్ బాహుబలి సినిమా కూడా ఓ మైలురాయిగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు