యూవీ క్రియేషన్స్ లో అనుష్క సినిమా
BY Admin7 Nov 2021 4:44 AM

X
Admin7 Nov 2021 4:44 AM
అనుష్కశెట్టి. ఒకప్పటి టాలీవుడ్ స్వీటి. తెలుగులో చాలా రోజులు అయింది అనుష్క కన్పించక. ఆదివారం నాడు అనుష్కశెట్టి పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ అనుష్కశెట్టితో మరో సినిమా చేయనుంది. ఈ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ సినిమా. తొలుత మిర్చి సినిమాతో ఈ బ్యానర్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. ఆ తర్వాత భాగమతి సినిమా కూడా ఇదే బ్యానర్ లో చేసింది.
ఇప్పుడు మూడవ సారి ఇదే బ్యానర్ లో న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ తో రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం బాధ్యతలు పి. మహేష్ బాబు వహిస్తారని తెలిపారు.ఇది అనుష్క 48వ సినిమా. త్వరలోనే ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. గత ఏడాది వచ్చిన నిశ్శబ్దమే అనుష్క నటించిన సినిమా.
Next Story