సంజనకు బెయిల్ మంజూరు
BY Admin11 Dec 2020 12:46 PM GMT
X
Admin11 Dec 2020 12:46 PM GMT
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న కన్నడ నటి సంజన కు బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలు చూపటంతో ఈ సారి ఆమెకు కర్ణాటక కోర్టు పలు షరతులతో బెయిల్ ఇచ్చింది. ప్రతి నెలా రెండు సార్లు పోలీస్ స్టేషన్ లో హాజరు కావటంతోపాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో మూడు లక్షల రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.
డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. కన్నడనాట సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో సంజనతోపాటు రాగిణిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నో ప్రయత్నాల అనంతరం సంజనకు ఇప్పుడు బెయిల్ వచ్చింది.
Next Story