ఊహించని కాంబినేషన్ ఫిక్స్

దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సారి ఎవరూ ఊహించని కాంబినేషన్ తో ...అది కూడా మల్టీస్టార్టర్ మూవీ ని అనౌన్స్ చేశారు. ఎప్పటి లాగానే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతోంది. 2027 మొదటి పండగకు మీ ముందుకు వస్తున్నాం అంటూ సంక్రాంతికి రిలీజ్ అనే విషయాన్ని చెప్పేశారు. ఈ సారి సినిమా వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో రానుంది. మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరోతో, "మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి 2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు దర్శకుడు అనిల్ రావిపూడి.



