చిరు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ

తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాను అందించిన దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి తాజాగా ఒక ఖరీదు అయిన కారు ను బహుకరించారు. అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ కారు ఇప్పుడు అనిల్ రావిపూడి సొంతం అయింది. ఈ కారు బహుకరించే సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. కారు నచ్చిందా అని చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడిని అడగ్గా...మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధన్ అంటూ అనిల్ రావిపూడి సందడి చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడికి...చిరంజీవి కారు గిఫ్ట్ గా ఇచ్చిన ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. గత కొంత కాలంగా టాలీవుడ్ లో విజయవంతం అయిన సినిమా దర్శకులు...మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఖరీదు బహుమతులు అందచేయటం ఒక ట్రెండ్ గా మారింది.



