హీరోయిన్లు గా కీర్తి సురేష్, కృతి శెట్టి

టాలీవుడ్ లో ఇప్పుడు వరస విజయాలతో దూసుకెళుతున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉన్నారు. ఆయనతో సినిమా అంటే చాలు కమర్షియల్ హిట్ ఖాయం అన్నట్లు టాలీవుడ్ లో ఫిక్స్ అయింది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ దక్కించుకున్న అనిల్ రావిపూడి..ఈ ఏడాది సంక్రాంతికి కూడా మన శంకరవరప్రసాద్ సినిమాతో మరో సూపర్ హిట్ దక్కించుకున్నారు. ఈ రెండు సినిమాలు వరుసగా ప్రపంచ వ్యాప్తంగా ఒక్కొక్కటి 300 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లోకి చేరినవే కావటం విశేషం. కొద్ది రోజుల క్రితమే వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో కలిసి కొత్త సినిమా చేయబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం నాడు హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.



