Telugu Gateway
Cinema

అంచనాలు అందుకోలేక పోయిన అమిగోస్

అంచనాలు అందుకోలేక పోయిన అమిగోస్
X

నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాబినయం చేసిన సినిమా అమిగోస్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 4 .65 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా ఆషికారంగనాథ్ నటించింది. తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర రెడ్డి సినిమా కథకు మంచి లైన్ తీసుకున్నా ప్రేక్షకులనుఁ ఆకట్టుకునేలా నడిపించడంలో తడబడ్డారు. ఈ సినిమాలో హై లైట్ ఏమైనా ఉంది అంటే అంటే తొలి సారి విలన్ గా కూడా కనిపించిన కళ్యాణ్ రామ్ బిపిన్ రాయ్ పాత్రదే అన్ని చెప్పొచ్చు.

ఇటీవలే బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టడంతో అమిగోస్ పై కూడా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా మైనస్ అయింది అనే అభిప్రాయం టాలీవుడ్ వర్గాల్లో ఉంది. అమిగోస్ కు మొత్తం బిజినెస్ 12 కోట్ల రూపాయలు జరిగింది అని...వీకెండ్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించటం పెద్ద కష్టం కాదనే చెపుతున్నారు. సహజంగా శని, ఆదివారాలు కలెక్షన్స్ ఆశాజనకంగా ఉంటాయనే విషయం తెలిసిందే.

Next Story
Share it