Telugu Gateway
Cinema

రెండు రోజులు...5 .16 కోట్లు

రెండు రోజులు...5 .16 కోట్లు
X

సుహాస్. టాలీవుడ్ లో కొత్త కొత్త కథలతో తనకంటూ ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకుంటూ ముందువెళుతున్నాడు. తాజాగా సుహాస్ నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మంచి టాక్ దక్కించుకుంది. ఈ సినిమా విడుదల అయిన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 5 . 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో సుహాస్ తో పాటు హీరోయిన్ గా నటించిన శివాని నగరం, శరణ్య ల నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సుహాస్ గత సినిమా రైటర్ పద్మనాభం కూడా మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ కూడా హిట్ ఇచ్చినట్లే.

Next Story
Share it