'అల్లుడు అదుర్స్' ట్రైలర్ విడుదల
BY Admin5 Jan 2021 2:26 PM GMT

X
Admin5 Jan 2021 2:26 PM GMT
కొత్త సంవత్సరంలో సినిమాలో సందడి క్రమక్రమంగా పెరుగుతోంది. వరస పెట్టి థియేటర్లలో సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన 'అల్లుడు అదుర్స్' కూడా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం నాడు ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో శ్రీనివాస్ కు జోడీగా నభా నటేశ్, అను ఇమ్మాన్యుయేల్ లు నటించారు.
Next Story