Telugu Gateway
Cinema

ఏఏ 23 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ త్వరలో

ఏఏ 23 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ త్వరలో
X

అల్లు అర్జున్ ఒక వైపు రాకా మూవీ షూటింగ్ పనుల్లో ఉంటూనే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఫోకస్ పెట్టాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా మూవీ లో అల్లు అర్జున్ కు జోడిగా దీపికా పదుకొనె నటిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే అల్లు అర్జున్ మరో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజు తో కలిసి ఏఏ 23 ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నాడు. అయితే రాకా మూవీ పూర్తి అయ్యేది ఎప్పుడు...ఏఏ 23 మొదలుపెట్టేది ఎప్పుడు అంటూ గత కొన్ని రోజులుగా రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం ఊపు అందుకుంది.

ఈ తరుణంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్, అల్లు అర్జున్ ఇద్దరూ కూర్చుని సీరియస్ గా చర్చించుకుంటున్న ఫోటో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అంతే కాదు...త్వరలోనే ఏఏ 23 నుంచి మంచి ఇంటరెస్టింగ్ అప్ డేట్స్ ఉంటాయి సిద్ధంగా ఉండండి అంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. దీంతో ‘AA 23’ ప్రాజెక్ట్ పనుల్లో ఎలాంటి జాప్యం లేదు అనే విషయాన్ని చిత్ర యూనిట్ స్పష్టం చేసినట్లు అయింది. త్వరలోనే అధికారికంగా ఈ సినిమా వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించవచ్చు అని చెపుతున్నారు.

Next Story
Share it