Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ కు కరోనా

అల్లు అర్జున్ కు కరోనా
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలసిన వారు కరోనా టెస్ట్ లుచేయించుకోవాలన్నారు.

తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. ప్రేమతో మీ అల్లు అర్జున్ అంటూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it