సినీ ప్రముఖుల క్యూ
అల్లు అర్జున్ శనివారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. తెలంగాణ హై కోర్టు ఆయనకు శుక్రవారం నాడే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా కూడా ఆ బెయిల్ పత్రాలు జైలు కు చేరటంతో జాప్యం జరగటంతో అల్లు అర్జున్ ఒక రాత్రి జైలు లో గడిపారు. జైలు అధికారులు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ...శనివారం ఉదయం ఆరున్నర సమయంలో అల్లు అర్జున్ ను విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకొని..అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోయారు.ఇంటి దగ్గర మీడియా తో మాట్లాడుతూ తనకు అండగా ఉన్న వాళ్ళు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
సంధ్య థియేటర్ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది అని..రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మరో సారి స్పష్టం చేశారు. తాను చట్టానికి కట్టుబడి ఉంటానని...ఇప్పుడు ఈ కేసు వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి ఏమి మాట్లాడానని తెలిపారు. ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు పలువురు పరామర్శించారు. ఇందులో ప్రముఖ దర్శకులు సుకుమార్, కొరటాల శివ, వంశీ, దిల్ రాజు, హీరో విజయ్ దేవర కొండ, ఆనంద్ దేవరకొండ , మైత్రి నిర్మాతలు ఉన్నారు.