పుష్ప షూటింగ్ మొదలైంది
BY Admin6 July 2021 6:12 AM GMT
X
Admin6 July 2021 6:12 AM GMT
కరోనా కారణంగా ఆగిపోయిన పుష్ప షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తోంది. తొలిసారి తెలుగులో మళయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్ లో దర్శనం ఇవ్వనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన పరిచయ వీడియో పుష్పరాజ్ విడుదలతో ఈ విషయం తేటతెల్లం అయింది. పుష్ప సినిమా మొత్తంగా రెండు భాగాలు విడుదల కానుంది. ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థగా ఉంది.
Next Story