Telugu Gateway
Cinema

'పుష్ప' విడుద‌ల డిసెంబ‌ర్ 17న

పుష్ప విడుద‌ల డిసెంబ‌ర్ 17న
X

అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న న‌టించిన 'పుష్ప' సినిమా విడుద‌ల ముహుర్తం ఖ‌రారైంది. డిసెంబ‌ర్ 17న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ శ‌నివారం నాడు అధికారికంగా ప్ర‌క‌టించింది. తొలుత క్రిస్మ‌స్ అంటూ ప్ర‌క‌ట‌న చేశారు త‌ప్ప‌..తేదీ వెల్ల‌డించలేదు. ఇప్పుడు తేదీ స‌హా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్ తెర‌కెక్కించారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో పోషిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్‌లో నటిస్తున్నాడు. పుష్ప మూవీ రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు తొలి భాగం విడుద‌ల కానుంది. ఊర‌మాస్ లుక్ లోఅల్లు అర్జున్ ఇందులో క‌న్పించ‌నున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్ప‌టికే అంచ‌నాలు ఓ రేంజ్ కు చేరాయి.

Next Story
Share it