Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ 'పుష్ప' సర్ ప్రైజ్ వచ్చేసింది

అల్లు అర్జున్ పుష్ప సర్ ప్రైజ్ వచ్చేసింది
X

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. స్టైలిష్ స్టార్ నటిస్తున్న 'పుష్ప' సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. ఆగస్టు13న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తోంది.

ఎర్రచందనం అక్రమ రవాణా కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో అల్లు అర్జున్ చాలా రఫ్ లుక్ లో కన్పిస్తున్నారు. మాసిపోయిన డ్రస్స్ తో ..చేతిలో గొడ్డలితో కన్పిస్తున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో సాగుతున్నట్లు సమాచారం.

Next Story
Share it