Telugu Gateway
Cinema

ఫస్ట్ దంగల్..రెండవ ప్లేస్ లో పుష్ప 2

ఫస్ట్ దంగల్..రెండవ ప్లేస్ లో పుష్ప 2
X

అల్లు అర్జున్ పుష్ప 2 కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ సినిమా 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1799 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు ను పుష్ప 2 బ్రేక్ చేసినట్లు అయింది. బాహబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1788 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు దేశ సినిమా చరిత్రలో దంగల్ తర్వాత అత్యధిక వసూళ్ల సాధించిన రెండవ సినిమా గా పుష్ప 2 నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే హిందీ బెల్ట్ లో ఎవరూ ఊహించని రీతిలో విజయం దక్కించుకోవటంతో పుష్ప 2 కు ఈ వసూళ్ల సాధ్యం అయ్యాయనే చెప్పాలి.

నూతన సంవత్సరం తొలి రోజు హిందీ వెర్షన్ లో 9 . 5 కోట్ల రూపాయల వసూళ్ల నమోదు అయితే...తెలుగు వెర్షన్ లో మాత్రం మూడు కోట్ల పది లక్షల రూపాయలు వచ్చాయి. ఒక్క భారత్ లోనే ఈ సినిమా 1184 కోట్ల రూపాయల వసూళ్లు సాధించగా..హిందీ మార్కెట్ నుంచి వచ్చిన మొత్తం 775 కోట్ల రూపాయలుగా ఉంది. ఇప్పటి వరకు ఇండియా లో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా 2070 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story
Share it