Telugu Gateway
Cinema

'అల్లు అర్జున్' కొత్త రికార్డు

అల్లు అర్జున్ కొత్త రికార్డు
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో కొత్త రికార్డును న‌మోదు చేశారు ఈ సినిమాకు సంబంధించి గురువారం నాడు విడుద‌ల చేసిన సామి నా సామి లిరిక‌ల్ సాంగ్ అత్యంత వేగంగా 50 ల‌క్షల వ్యూస్ సాధించింది. ఇది ఆల్ టైమ్ రికార్డుగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెట్టింది. ఈ పాట‌లో అల్లు అర్జున్, ర‌ష్మిక‌ల లుక్ కూడా డిఫ‌రెంట్ గా ఉంది.

అంతే కాదు...స్టెప్స్ కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల అయిన మూడు పాట‌ల‌తో ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్ కు చేరాయని చెప్పొచ్చు. ఫుల్ మాస్ లుక్ లో అటు అల్లు అర్జున్, ఇటు ర‌ష్మిక‌లు ఈ పాట‌లో ఆక‌ట్టుకున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ ల ఈ హ్యాట్రిక్ సినిమా తొలి భాగం డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story
Share it