Telugu Gateway
Cinema

సోషల్ మీడియా లో బాయ్ కాట్ అంటూ రచ్చ రచ్చ

సోషల్ మీడియా లో బాయ్ కాట్ అంటూ రచ్చ రచ్చ
X

అల్లు అర్జున్ ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో కూడా అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు. శనివారం నాడు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి కి మద్దతు పలికారు. తన మనసుకు నచ్చిన వాళ్ళు ఏ పార్టీ లో ఉన్నా సపోర్ట్ చేస్తా అంటూ మీడియా ముందు కామెంట్ చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం అయింది. పవన్ కళ్యాణ్ కోసం కేవలం ట్వీట్ చేసి...ఆయన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇంటికి వెళ్లి మద్దతు పలకడంతో అటు పవన్ ఫ్యాన్స్, జన సేన అభిమానులు కూడా అల్లు అర్జున్ పై ఫుల్ ఫైర్ అవుతున్నారు. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్లు ఇప్పుడు అదే బ్యాచ్ తో అల్లు అర్జున్ కలిసిపోయారు అని కొంతమంది సోషల్ మీడియా లో ఘాటు కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. ఇంట్లో మనిషి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయటానికి కుదరలేదు కానీ..వైసీపీ అభ్యర్ధికి మాత్రం ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటన చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రెండ్ కోసం వెళ్లిన వాడివి మామయ్య కోసం వెళ్ళలేవా అని మరికొంత కామెంట్స్ చేశారు. పుష్ప 2 సినిమా ఉందిగా చూసుకుందాం అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ నంద్యాల టూర్ విషయం ఇప్పుడు పుష్ప 2 వైపు మళ్లింది. అల్లు అర్జున్ కు బుద్దిరావాలంటే పుష్ప 2 బాయ్ కాట్ కు పిలుపు ఇస్తే సరిపోతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ అభిమానులు...జన సైనికులు ఈ విషయంలో ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే వైసీపీ అభిమానులు మాత్రం అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాళ్ళు పుష్ప 2 సూపర్ హిట్ కావాలంటూ పోస్టు లు పెడుతూ...ఆయనకు అండగా ఉంటామని కౌంటర్ కు దిగుతున్నారు. ఈ విషయం ఎన్నికలు ముగియగానే ముగిసిపోతుందా..లేక నిజంగానే పుష్ప 2 సినిమా విడుదల అయ్యే ఆగస్ట్ 15 వరకు ఉంటుందా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it