Telugu Gateway
Cinema

అదిరేటి 'రౌడీ' డ్రెస్ లో అల్లు అర్జున్

అదిరేటి రౌడీ డ్రెస్ లో అల్లు అర్జున్
X

అల్లు అర్జున్ అదరగొడుతున్నారు. అది కూడా 'రౌడీ' డ్రెస్ లో. ఈ రౌడీ డ్రెస్ ఏంటి అంటారా?. హీరో విజయదేవరకొండ ఇదే బ్రాండ్ తో బట్టలు అమ్ముతున్న విషయం తెలిసిందే. విజయే స్వయంగా అల్లు అర్జున్ కు ఈ బట్టలు పంపారు. వాటిని వేసుకుని ఫోటోకు ఫోజు ఇచ్చిన అల్లు అర్జున్ ఆ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు.

అందులోనే తనకు కూల్ పెయిర్ పంపిన విజయ్ దేవరకొండకు థ్యాంక్యూ బ్రదర్ అంటూ పేర్కొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసమే గత కొంత కాలంగా అల్లు అర్జున్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కన్పిస్తున్నాడు.

Next Story
Share it