Telugu Gateway
Cinema

వెయ్యి కోట్లు రాబడుతుందా?!

వెయ్యి కోట్లు రాబడుతుందా?!
X

రజనీ కాంత్ హీరో గా నటించిన జైలర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. దసరా సెలవులను టార్గెట్ గా చేసుకుని అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 576 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ మూవీ పై టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ తన నిజమైన స్టార్ పవర్ ఏంటో చూపించారు. తన స్వాగ్, ఆరా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కి కావాల్సిన హై మూమెంట్స్ ని జైలర్ 2 అందించింది. బ్రదర్ అనిరుద్ చంపేశావ్.. నెల్సన్ దిలీప్ కుమార్ కూల్ హిట్ తో ఒక విధ్వంసం చూపించావ్. జైలర్ 2 టీం అందరికి అభినందనలు అంటూ స్పందించాడు అల్లు అర్జున్.

“చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఒక్క రజినీకే సాధ్యం!” అంటూ చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ ఈ కామెంట్ చేయటానికి ప్రధాన కారణం సినిమాలో ఎక్కడా రజనీకాంత్ నేరుగా ఫైట్స్ చేయకుండానే తనదైన స్టైల్ తో మూవీ ని ఒక రేంజ్ కు తీసుకెళ్లటమే. జైలర్ 2 సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించగా...సన్ పిక్చర్స్ నిర్మించింది. ఇదే బ్యానర్ లో ఇప్పుడు అల్లు అర్జున్ రాకా మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జైలర్ 2 మూవీ థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే నాటికీ వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు రాబడుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it