Telugu Gateway
Cinema

'జాతిరత్నాలు'పై అల్లు అర్జున్ ప్రశంసలు

జాతిరత్నాలుపై అల్లు అర్జున్ ప్రశంసలు
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'జాతిరత్నాలు' చిత్ర టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తాను గురువారం రాత్రి ఈ సినిమా చూశానని... గత కొన్ని సంవత్సరాలుగా తాను ఎప్పుడూ ఇంతగా ఎప్పుడూ నవ్వలేదని పేర్కొన్నారు. నవీన్ పోలిశెట్టి తన నటనతో ఈ సినిమాలో అదరగొట్టాడని ప్రశంసించాడు. కొత్తతరం నటుడిగా నవీన్ వెలుగులోకి వచ్చాడన్నారు.

అదే సమయంలో రాహుల్ రామకృష్ణ తోపాటు ప్రియదర్శిపై కూడా అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరిని ఎంతగానో నవ్వించేలా ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అనుదీప్ కు ప్రత్యేకంగా తన అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరికి మెదళ్ళకు తాళం వేసి..సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.

Next Story
Share it