దుబాయ్ 'ఔరా స్కైపూల్ లో అల్లు అర్జున్'
ప్రపంచంలోనే ఎత్తైన 360 డిగ్రీల ఇన్ఫినిటి పూల్ ఇదే. దీని పేరే ఔరా స్కైపూల్. ఇక్కడ నిలుచుని దుబాయ్ ను చూస్తే ఆ ఫీలింగే వేరు. కొద్ది రోజుల కిందటే ఇది పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఆకాశంలో స్విమ్మింగ్ చేయటంతోపాటు..ఇక్కడ నుంచి చూస్తుంటే దుబాయ్ తమ కాళ్ల కింద ఉన్న ఫీలింగ్ కలగటం ఖాయం అని నిర్వాహకులు ఘనంగా ప్రకటించుకుంటారు. పామ్ జువేరాలోని పామ్ టవర్ లోని 50వ అంతస్థులో ఔరా స్కైపూల్ ఉంటుంది.
గురువారం నాడు అల్లు అర్జున్ ఔరా స్కైపూల్ లో నిలుచుని ఇలా ఫోటోలకు ఫోజిచ్చారు. అంతే కాదు..ఈ ఫోటోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. అదే ఇది. 2021 నవంబర్ నుంచి ఇది పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలు ఉన్న దుబాయ్ పర్యాటక సిగలో ఇప్పుడు ఇది ఓ కొత్త ఆకర్షణగా నిలిచింది. అల్లు అర్జున్ తాజాగా పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.