Telugu Gateway
Cinema

సినిమాల్లోకి అల్లు అర్జున్ కుమార్తె

సినిమాల్లోకి అల్లు అర్జున్ కుమార్తె
X

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం సినిమా తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో స‌మంత శాకుంత‌లగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఈ విష‌యాన్ని అల్లు అర్జున్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్లడించారు.

అల్లు అర్హ ఎంట్రీతో త‌మ ఫ్యామిలీ నుంచి నాల‌గ‌వ త‌రం కూడా సినిమాల్లోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లు అయింద‌ని అల్లు అర్జున్ పేర్కొన్నారు. త‌న కుమార్తెకు ఇంత‌టి కీల‌క సినిమా ద్వారా అవ‌కాశం క‌ల్పించిన గుణ‌శేఖ‌ర్, నీలిమా గుణ‌ల‌కు థ్యాంక్స్ చెప్పారు స్టైలిష్ స్టార్. అదే స‌మ‌యంలో శాకుంతలం టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story
Share it