Telugu Gateway
Cinema

రామ్ చరణ్ పై వెంకటేష్ పొగడ్తలు

రామ్ చరణ్ పై వెంకటేష్ పొగడ్తలు
X

ఆర్ఆర్ఆర్ టీం వరస పెట్టి అవార్డులు కొడుతోంది. తాజాగా ఈ సినిమా కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్ సిఏ ) నుంచి ఏకంగా నాలుగు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సీనియర్ హీరో వెంకటేష్, ఆర్ఆర్ఆర్ హీరో రాంచరణ్ ఒక పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. అక్కడే వెంకటేష్ అవార్డులన్నీ రాంచరణ్ కే అంటూ అయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో నాటు నాటు అంటూ పాట గురించి ప్రస్తావించగా..పెళ్ళికి హాజరు అయినా వారు అంతే కేరింతలు కొట్టారు. వెంకటేష్ ప్రశంసలపై స్పందించిన రాంచరణ్ థాంక్యూ వెంకీ అన్నా అంటూ స్పందించారు

రాంచరణ్ కొద్ది రోజుల క్రితమే అమెరికా కు చేరుకోగా..వెంకటేష్ పెళ్లి కోసం అక్కడకు వెళ్లినట్లు చెపుతున్నారు. మార్చ్ 12 న ప్రకటించనున్న ఆస్కార్ అవార్డు ల వరకు ఆర్ఆర్ఆర్ టీం అక్కడే ఉండనుంది. ఒక్క ఎన్టీఆర్ తప్ప టీం అంతా ఇప్పటికే అమెరికాలో ఉంది. త్వరలోనే ఎన్టీఆర్ కూడా వీళ్ళతో కలవనున్నారు. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్స్ కేటగిరీ లో ఆస్కార్ కు నామినేషన్స్ కు ఎంపికైన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఈ పాటకు ఆస్కార్ వస్తుంది అనే ధీమాతో ఉంది. వారి కల నిజం అయితే ఇది పెద్ద సంచలనం కావటం ఖాయం.

Next Story
Share it