ఆర్ఆర్ఆర్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్
BY Admin2 April 2021 10:59 AM IST
X
Admin2 April 2021 10:59 AM IST
'ఆర్ఆర్ఆర్' టీమ్ లో కలకలం. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కరోనాబారిన పడ్డారు. ఆమె ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు కోవిడ్ 19 పాజిటివ్ అని తేలటంతో డాక్టర్ల సలహా మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించారు.
అన్ని ప్రొటోకాల్స్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ లో ఆమె సీత పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితోపాటు హీరో రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.
Next Story