'ఆర్ఆర్ఆర్' లో అలియాభట్ ఫస్ట్ లుక్
BY Admin15 March 2021 6:12 AM

X
Admin15 March 2021 6:12 AM
ప్రతిష్టాత్మక సినిమా 'ఆర్ఆర్ఆర్' సందడి ఊపందుకుంది. వరస పెట్టి చిత్ర యూనిట్ కొత్త అప్ డేట్స్ ఇస్తూ పోతోంది. ముందు ప్రకటించినట్లుగా సోమవారం నాడు సీతగా నటిస్తున్న అలియాభట్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియాభట్ నటిస్తోంది.
ఎంతో బలమైన సంకల్పశక్తి ఉన్న సీత రామరాజు కోసం ఎదురుచూస్తోంది అంటూ ఈ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా విదేశీ భామ జెన్నిఫర్ గా కన్పించనుంది. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Next Story