Telugu Gateway
Cinema

'ఆర్ఆర్ఆర్' నుంచి మరో అప్ డేట్

ఆర్ఆర్ఆర్ నుంచి మరో అప్ డేట్
X

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె 'సీత' పాత్ర పోషిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ మార్చి 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలియాభట్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది.

కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ నటి అలివియా మోరిస్ జెన్నిఫర్ పాత్రలో కన్పించనుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైనర్ మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు. మూడు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Next Story
Share it