Telugu Gateway
Cinema

ఒక్క‌టైన అలియా-ర‌ణ్ బీర్

ఒక్క‌టైన అలియా-ర‌ణ్ బీర్
X

బాలీవుడ్ లో గ‌త కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్రేమికులు ఉన్న ర‌ణ్ బీర్-అలియా భ‌ట్ లు గురువారం నాడు వివాహ‌బంధంలోకి అడుగుపెట్టారు. అలియా భ‌ట్ త‌మ పెళ్ళి విష‌యాన్ని..ఫోటోల‌ను ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. స్నేహితులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య త‌మ‌కు ఎంతో ఇష్ట‌మైన ప్రాంతంలోబాల్క‌నీలో పెళ్ళి చేసుకున్నామ‌ని వెల్ల‌డించింది. తామిద్ద‌రం గ‌త ఐదేళ్ళుగా ఇదే ప్రాంతంలో రిలేష‌న్ షిప్ లో గ‌డిపామ‌ని వెల్ల‌డించింది. మ‌రిన్న మ‌ధురమైన అనుభూతులు పంచుకునేందుకు వీలుగా పెళ్ళి చేసుకున్న‌ట్లు తెలిపారు.

ఈ బాలీవుడ్ హై ప్రొఫైల్ వెడ్డింగ్‌కి నీతూ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేశ్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు. ర‌ణ్‌బీర్ కపూర్, అలియా భట్‌లు రిసెప్షన్‌ను ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారని బాలీవుడ్ మీడియా స‌మాచారం. అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 'బ్రహ్మాస్త్ర' సినిమా షూటింగ్ సమయంలో వీరికి ఒకరితో మరొకరికి స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.. ప్రస్తుతం వీరు 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబరు 9న విడుదల కానుంది.

Next Story
Share it