Telugu Gateway
Cinema

షాకింగ్ లుక్ లో అఖిల్

షాకింగ్ లుక్ లో అఖిల్
X

చాలా రోజుల త‌ర్వాత అక్కినేని అఖిల్ కు 'మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్ ల‌ర్ ' మూవీతో క‌మ‌ర్షియ‌ల్ హిట్ ద‌క్కింది. అఖిల్ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా ఇది నిలిచింది. ఇప్పుడు అదే ట్రెండ్ ను కొన‌సాగించేందుకు అఖిల్ ఇక మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి ఉంది. అందులో భాగంగానే ఆయ‌న సోష‌ల్ మీడియాలో త‌న కొత్త లుక్ పెట్టారు. ఇది చూసిన వారు షాక్ అవుతున్నారు. అఖిల్ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్‌' సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ మూవీ కోసం ఎంత క‌ష్ట‌ప‌డుతున్నాడో ఈ లుక్ చూస్తే తెలుస్తుంది.

తాజాగా షాకింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మారిన అఖిల్‌ న్యూ లుక్‌ సోషల్‌ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.జిమ్‌లో కండలు తిరిగిన బాడీతో బీస్ట్‌ లుక్‌లో అఖిల్‌ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it