Telugu Gateway
Cinema

సండే ఫిగర్స్ తోనే అనుమానాలు!

సండే ఫిగర్స్ తోనే అనుమానాలు!
X

అక్కినేని అఖిల్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా లెనిన్ మూవీ నిలవబోతోంది. ఈ సినిమా ఇప్పటికే అంటే కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 61 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్ళను సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అయితే రెండు రోజుల వసూళ్లు 37. 2 కోట్ల రూపాయలు అయితే...మూడవ రోజుకు మొత్తం వసూళ్లు ఏకంగా 61 .1 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాజిటివ్ మౌత్ టాక్ తో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ ఒక్క ఆదివారం నాడు ఈ సినిమా ఏకంగా 23.9 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు చూపటం పలు అనుమానాలకు కారణం అవుతోంది.

ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 16 .7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అంటే ఫస్ట్ రోజు కంటే జులై 12 న అంటే సండే వసూళ్లు దగ్గర దగ్గర 24 కోట్ల రూపాయలుగా చూపటం ప్రాధాన్యత సంతరించుకుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ మూవీ లో అటు అఖిల్ తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. వీకెండ్ వరకు జోష్ లో ఉన్న లెనిన్ మూవీ బుకింగ్స్ సోమవారం నాడు తగ్గుముఖం పట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే వరకు వంద కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లో చేరుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓవర్సీస్ లో కూడా లెనిన్ కు మంచి టాక్ రావటంతో అక్కడ కూడా కలెక్షన్స్ పెరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it