Telugu Gateway
Cinema

లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్

లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్
X

అక్కినేని అఖిల్ కెరీర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ సాధించిన మూవీ ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటే. అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ. మిగిలిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని చవిచూసినవే. ఇప్పుడు మూడేళ్ళ గ్యాప్ తర్వాత అఖిల్ లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే గత సినిమాలతో పోలిస్తే అఖిల్ లెనిన్ మూవీ చాలా వరకు బాగుంది అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఫలితంపై మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నా కూడా అఖిల్ ఈ మూవీ తో ట్రాక్ లోకి వచ్చినట్లు అయింది అనే చెప్పాలి.

లెనిన్ మూవీ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 16 .7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. లెనిన్ మూవీ లో అఖిల్ తో పాటు భాగ్యశ్రీ భోర్సే తనదైన ముద్ర వేసింది అనే చెప్పాలి. అక్కినేని నాగార్జున..సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఈ సినిమా విడుదల పలు మార్లు వాయిదా పడినా పలు జాగ్రత్తలు తీసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఫలితం కనిపిస్తోంది అనే అభిప్రాయం టాలీవుడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా వీకెండ్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it