Telugu Gateway
Cinema

జీ 5 లో స్ట్రీమింగ్

జీ 5 లో స్ట్రీమింగ్
X

అక్కినేని అఖిల్ కు 2026 సంవత్సరం జీవితంలో గుర్తుండిపోయే ఏడాదిగా నిలుస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. పరిశ్రమలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా అసలు ఒక్క హిట్టే లేని ఈ హీరో కు లెనిన్ సినిమా కొత్త జీవితాన్ని ఇచ్చింది. చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించింది. దీనిపై అనుమానాలు అయితే చాలానే ఉన్నాయి. కాకపోతే కలెక్షన్స్ సంగతి కాసేపు పక్కనపెడితే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా అఖిల్ కు హిట్ ఇచ్చింది అని చెప్పొచ్చు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అఖిల్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ముఖ్యంగా వీళ్లిద్దరి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రసంశలే దక్కాయి.

చిత్ర యూనిట్ చెప్పింది నిజం అయితే అఖిల్ కెరీర్ లోనే వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా లెనిన్ నిలుస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద విజయం దక్కించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. ఈ మూవీ ఓటిటి హక్కులను జీ 5 దక్కించుకుకుంది. ఆగస్ట్ 7 నుంచి ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 వెల్లడించింది. జులై 10 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెనిన్ సినిమాకు థమన్ సంగీతం అందిస్తే... సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, నాగార్జునలు నిర్మాతలుగా వ్యవహరించారు.

Next Story
Share it