బాలకృష్ణ బర్త్ డే స్పెషల్ వచ్చేసింది
BY Admin9 Jun 2021 12:50 PM GMT
X
Admin9 Jun 2021 12:50 PM GMT
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని అఖండ చిత్ర యూనిట్ కొత్త లుక్ ను విడుదల చేసింది. టైటిల్ రోర్ పేరుతో అఖండ టైటిల్ కు సంబంధించి విడుదల చేసిన వీడియో టాలీవుడ్ లో కొత్త రికార్డులు నమోదు చేసిన విషయం తెలిసిందే. జూన్ 10న అంటే గురువారం బాలకృష్ణ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. బోయటిపాటి, బాలకృష్ణల కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం ఈ అఖండ.
ఇందులో బాలకృష్ణకు జోడీగా తొలిసారి ప్రగ్యాజైస్వాల్ నటిస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన న్యూలుక్ లో బాలకృష్ణ స్టైల్ గా కన్పిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. బోయపాటి, బాలక్రిష్ణల కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా, లెజండ్ సినిమాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
Next Story