Telugu Gateway
Cinema

అంచనాలు పెంచిన టీజర్

అంచనాలు పెంచిన టీజర్
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిస్తే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 10 బాలకృష్ణ పుట్టిన రోజు కావటంతో అఖండ 2 టీజర్ ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. బోయపాటి , బాలకృష్ణల నుంచి ఆయన ఫ్యాన్స్ ఏమి కోరుకుంటారో అవే ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. టీజర్ లో త్రిశూలం ఫైట్ సీన్ అల్టిమేట్ అనే చెప్పాలి. ‘‘ నా శివుడి అనుమతి లేనిదే యముడు అయినా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా. అమాయకుల ప్రాణాలు తీస్తావా ’’ అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగు ఇందులో హైలైట్ గా నిలుస్తుంది.

అఖండ తాండవం 2 టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది అనే చెప్పాలి. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి చేసిన సింహ, లెజెండ్ , అఖండ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయాన్ని దక్కించుకున్నాయో అందరికి తెలిసిందే. అఖండ 2 వీళ్ళ కాంబినేషన్ లో నాలగవ సినిమా. ఈ మూవీ కి కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్ ఆచంట, గోపి అచంటలు నిర్మాతలుగా ఉన్న ఈ సినిమా వచ్చే దసరాకు అంటే సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it