Telugu Gateway
Cinema

'అఖండ' ట్రైల‌ర్ వచ్చేసింది

అఖండ ట్రైల‌ర్ వచ్చేసింది
X

బాలకృష్ణ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ అంటే ఓ క్రేజ్. ఇప్పుడు ఆ క్రేజ్ ఓ రేంజ్ కు చేరింది. ఆదివారం నాడు ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఈ ట్రైల‌ర్ లో బాలకృష్ణ డైలాగులు అదిరిపోయేలా ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడీగా తొలిసారి ప్ర‌గ్యా జైస్వాల్ సంద‌డి చేయ‌నున్నారు.

అఖండ‌లో శ్రీకాంత్, జ‌గ‌ప‌తిబాబులు కూడా కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వార‌కా క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నీ మాట శ‌బ్దం... నా మాట శాస‌నం అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్ ట్రైల‌ర్ లో హైలెట్ గా నిలుస్తుంది. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లతో అఖండ గ‌ర్జ‌న పేరుతో ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

Next Story
Share it