'అఖండ' షూటింగ్ పూర్తి
BY Admin5 Oct 2021 12:58 PM IST
X
Admin5 Oct 2021 12:58 PM IST
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ'. ఇందులో నందమూరి బాలక్రిష్ణ, ప్రగ్యాజైస్వాల్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ మంగళవారం నాడు వెల్లడించింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో కన్పించనున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. అయితే దీపావళికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Next Story